ముందు వెనకా... అటూ ఇటూ అంతా వాళ్లేనట

June 03, 2015 | 06:15 PM | 1 Views
ప్రింట్ కామెంట్
somi_reddy_chandra_mohan_reddy_niharonline

తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలన్నీ టీడీపీని పతనం చేయాలని చూస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ అధినేత జగన్ లు కుమ్మక్కయ్యారని అంటున్నారు. చంద్రబాబును దెబ్బతీసేందుకు వారంతా ఒకటయ్యారని, వారి వారి పార్టీలో కూర్చునే వారంతా పార్టీ ఫిరయింపుదారులని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ ముందు కూర్చుంటే ఆయన ముందు మైసురారెడ్డి, వెనక రోజా, కుడివైపు కొడాలి నాని, ఎడమవైపు సూర్యనారయణ ఉంటారని విమర్శించారు. అలాగే కేసీఆర్ విషయానికొస్తే... ముందు తుమ్మల, వెనుక కడియం, కుడివైపు తలసాని, ఎడమవైపు మహేందర్ రెడ్డి ఉంటారని అన్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఆ పార్టీ వ్యక్తులు కారని అన్నారు. ఫిరాయింపుదారులతో పార్టీలు కొనసాగించటానికి సిగ్గు లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ