పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మానవతా వాదం పాలు కాస్త ఎక్కువే. సినీరంగంలో ఉండే ఏ వ్యక్తి కూడా సాధారణంగా ప్రజా సమస్యలను అంతగా పట్టించుకోరు. కానీ, ఓ స్టార్ డమ్ ఏర్పడ్డాక కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రజలపక్షాన నిలవటం నిజంగా గ్రేట్. అలాంటి వ్యక్తి జనసేన పార్టీ ద్వారా నేరుగా ప్రజల చెంతకు చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. గతేడాది సాధారణ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి ప్రత్యక్ష మద్ధతు ఇవ్వటంతోపాటు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి క్రుషి చేశాడు. ఇక ఇప్పుడు అభిమానులతోపాటు అందరి మదిలో ఉన్నది ఒకే ప్రశ్న... పవన్ ప్రత్యక్ష రాజకీయ ఎంట్రీ ఎప్పుడు అని! దాదాపు సంవత్సరం పూర్తవుతున్న ఇంతవరకు పవన్ ప్రత్యక్షరాజకీయ ప్రస్తావన గురించి ఎక్కడా లేదు. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తుంటే త్వరలో ఆయన బరిలో దిగే అవకావశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాలను నిలదీయటం. రాజధాని ప్రాంతంలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి నిర్వహించటం ఇవన్నీ పవన్ రాజకీయ రంగప్రవేశానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం సనత్ నగర్ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో పవన్ పోటీకి దిగుతాడనే వార్తలు వినవస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం సడన్ గా తీసుకుంది కాదట. దీని వెనుక బలమైన కారణం కూడా ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 1600 పార్టీలు ఎన్నికల సంఘం పరిధిలో నమోదయి ఉన్నాయట. కానీ, అందులో కేవలం 200 పార్టీలు మాత్రమే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహారిస్తున్నాయట. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి హెచ్ ఎస్ బ్రహ్మ స్వయంగా ప్రకటించారు. అంటే మిగిలిన 1400 పార్టీలు ఇంతవరకు ఎన్నికల్లో పోటీచేయలేదన్న మాట. ఇక వాటి వ్యవహారంలో కఠినంగా వ్యవహారించాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటిదాకా ఏ రెండు అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, ఒక్క పార్లమెంటు ఎన్నికల్లో గానీ పోటీ చేయని పార్టీ గుర్తింపును రద్దు చేయాలనే నిర్ణయంతీసుకుందట. ఇక ఈ నిర్ణయంతో జాగ్రత్త పడ్డ కళ్యాణ్ బాబు త్వరలోనే ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నాడట. అది కూడా ఏ పార్టీ మద్ధతు తీసుకోకుండా స్వతంత్ర్యగా పోటీచేయాలని పవన్ యోచిస్తున్నాడట. అంటే ప్రజా సేవ కోసం పవర్ స్టార్ రంగంలోకి దూకబోతున్నాడన్న మాట. మరి దీనిపై ఆయన ప్రకటన ఎలా చేయబోతున్నాడో... చూద్దాం. జనసేన అధినేత మరీ ఈ రిస్క్ చేస్తాడో లేదో!