కాంగ్రెస్ యువరాజు కానరాట్లేదట!

March 25, 2015 | 10:46 AM | 59 Views
ప్రింట్ కామెంట్
rahul_gandhi_missing_amethi_poster_niharonline

యువనేత, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆచూకీ కోసం ఆ పార్టీ నేతలతోపాటు, కార్యకర్తలంతా బెంగపెట్టుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు నాలుగు వారాలపాటు సెలవు తీసుకుని మరీ వెళ్లిన రాహుల్, సెలవు గడువు ముగిసిన పత్తాలేరు. సెలవు ముగిసిన తర్వాత దానిని మరో రెండు వారాలకు ఆయన పొడిగించుకున్నారని పార్టీ వర్గాలు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎంతకీ రాహుల్ తిరిగి  రాకపోవటంతో పార్టీలో ఇప్పుడు ఆందోళన నెలకొంది. తాజాగా నిన్న ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు, బులంద్ షహర్ తదితర ప్రాంతాల్లో రాహుల్ కనపడటం లేదని పోస్టర్లు వెలిశాయి. ‘‘రాహుల్... ఎక్కడున్నా వెంటనే వచ్చేయ్... అమ్మ సోనియా గాంధీ నీ కోసం బెంగపెట్టుకున్నారు’’అంటూ సదరు పోస్టర్లలో గుర్తు తెలియని వ్యక్తులు పేర్కొన్నారు. ఈ పోస్టర్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ నేతలే ఈ పోస్టర్లకు కారణమై ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోస్టర్లపై ఇప్పటిదాకా తమకెలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పిన యూపీ పోలీసులు... ఫిర్యాదు అందిన పక్షంలో దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ