జనసేన సీక్రెట్ మీటింగ్ ఉత్తది కాదు

April 12, 2016 | 02:08 PM | 6 Views
ప్రింట్ కామెంట్
janasena-party-meeting-vijayawada-niharonline

అప్పుడెప్పుడో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితం పార్టీ ప్రకటించిన సమయంలో కార్యకర్తలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. జనసేన ఆవిర్భావం తరువాత రెట్టించిన ఉత్సాహంతో జిల్లాల వారీగా కార్యవర్గాలు ఏర్పాటు అయ్యాయి కూడా. అయితే ఎన్నికల్లో బరిలోకి దిగకపోవటంతో, ఆపై సైలెంట్ అయిపోవటంతో ఎవరి దారి వెళ్లిపోయారు. మధ్యలో క్రియాశీలకంగా ఉన్నట్టు కనిపించినా, అది స్టేట్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జనసేన ఖచ్ఛితంగా పోటీచేస్తుదని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో వారంతా దుమ్ము దులుపుకుని రంగంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

                          పవన్ రాజకీయ ప్రవేశంపై పక్కా కావటంతో విజయవాడలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటుచేసుకున్నారు.  అయితే ప‌వ‌న్ ప్రయాణం మిత్రపక్షం టీడీపీ, బీజేపీ కూట‌మితో క‌లుస్తాడా? లేక ఆయన వైకాపాతోనా?  లేక టీడీపీ, బీజేపీలలో దేనితో ఒకదానితో కలుస్తారా? అసలు జనసేన దారెటు? వంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఏదేమైనా తమ అభిమాన నటుడు విజయవాడ నుంచే పోటీచేయాలని వారంతా గట్టిగానే కోరుతున్నారంట. ఈ స‌మావేశానికి ఏపీలోని అన్ని జిల్లాల నుంచి జ‌న‌సేన కార్యకర్తలు హాజ‌రు కానున్నారు. భవిష్యత్ ప్రణాళిక, పార్టీ విస్తరణ తదితర అంశాలతోపాటు పలు కీలకమైన నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇది పవన్ అనుమతితోనే జరుగుతుందా అన్నది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ