కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సమిష్టిగా ఎదుర్కొనేందుకు మళ్లీ ఆరు పార్టీల జనతా పరివార్ ఏకమైంది. బుధవారం జనతా పరివార్ విలీనంపై అధికారికంగా ప్రకటన వెలువడింది. సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో భేటీ అయిన ఆరు పార్టీల అధినేతలు ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. సమాజ్ వాదీ, ఆర్జేడీ, జేడీయూ, జేడీఎస్, ఐఎన్ఎల్ డీ, ఎన్ జేపీ పార్టీలు వీలీనమయ్యాయి. ఎస్పీ అధినేత ములాయం సింగ్ అధ్యక్షతన కొత్త ఫ్రంట్ ఏర్పడింది. కొత్త పార్లమెంటరీ నేతగా కూడా ములాయం వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియా సమావేశంలో శరద్ యాదవ్. ములాయం పరివార్ పై అధికారికంగా ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పరివార్ పోటీ చేస్తుంది. మరీ ఈ కూటమి మోదీ మేనియాకు ఏరేంజ్ లో అడ్డుకట్ట వేస్తుందో వేచిచూద్దాం...