అప్పడు అన్నా చచ్చిపోవాలని కేజ్రీ కోరుకున్నాడట

April 15, 2015 | 12:55 PM | 57 Views
ప్రింట్ కామెంట్
Kejriwal_try_to_kill_Anna_hazare_niharonline

ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత సంఘర్షణలు, రెబల్ నేతలతో వివాదాలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011లో ఢిల్లీలో చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తన మార్గనిర్దేశకుడైన అన్నా హాజారే చనిపోవాలని కేజ్రీ కోరుకున్నట్లు ఆయన ఆరోపించారు. నాటి ఉద్యమంలో మొదట్లో పాల్గొన్న అగ్నివేశ్ ఆ తర్వాత అనుకోని కారణాలతో దూరమయ్యారు. అయితే అప్పట్లో హాజారే నిరాహార దీక్షను మరింతకాలం పొడిగించేందుకు కేజ్రీ ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నాడు. ‘‘అప్పట్లో అవినీతి వ్యతిరేక ఉద్యమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మరో 10 లేదా 15 రోజులపాటు హాజారే చేత కేజ్రీ దీక్ష చేయించేవారు. ఇందుకు ఉద్యమం త్యాగాన్ని కోరుకుంటుందని కేజ్రీవాల్ అన్న మాటలే సాక్ష్యం. దాంతో తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చని అనుకున్నారు’’ అని అగ్నివేశ్ వెల్లడించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ