హత్యాయత్నం కేసులో ఎమ్యెల్యేకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ రాంచీ కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. జార్ఖండ్‌లోని లోహర్డగ నియోజకవర్గ ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్ ఓ హత్యాయత్నం కేసులో నిందితుడు. ఈ కేసును మంగళవారం విచారించిన కోర్టు అతనికి ఏడేళ్ల ఖైదుతోపాటు 15వేల రూపాయల జరిమానా విధించింది. కాగా, భగత్.. జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీకి చెందినవాడు గమనార్హం. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మరో పార్టీ నాయకుడు అలెస్టర్ బోద్రాకు కూడా కోర్టు ఇదే శిక్ష విధించింది.