బీహార్ లో ముఖ్యమంత్రి మార్పు విషయమై మరోసారి సంక్షోభం నెలకొంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ వార్తల్లో నిలిచాడు. దీంతో పార్టీ నాయకత్వం ఆయనపై అసంత్రుప్తితో ఉంది. అంతేకాదు ఎప్పుడైన సీఎం మార్పు ఉండవచ్చుననే సంకేతాలు కూడా ఇచ్చింది. ఇక బీజేపీపై పోరుకు లాలూప్రసాద్ తో చేతులు కలిపిన జేడీ(యూ) ఇందుకోసం మాజీ సీఎం నితీష్ ను బరిలో దించాలని నిర్ణయించుకుంది. ఇందుకు నితిశ్ కూడా అంగీకారం తెలపడంతో తిరిగి ఆయన్ను సీఎం చేసేందుకు పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం పార్టీ అధినేత శరద్ యాదవ్ తో ఎమ్మేల్యేలు సమావేశం కానున్నారు. ఇక ఈ సమావేశానికి దూరంగా ఉండాలని సీఎం మాంఝి నిర్ణయించుకున్నారు. తాను పేదల కోసమే పనిచేస్తున్నానని, తనను తొలగించుకోవాలనుకోవటం సరైంది కాదని ఆయన అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయబోనని ఆయన చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అవసరమైతే పార్టీని చీల్చేందుకు కూడా ఆయన వెనుకాట్లేదని తెలుస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారట.