ఫ్లాష్... ష్లాష్... మాంఝీ ని బహిష్కరించిన జేడీ(యూ)

February 09, 2015 | 01:08 PM | 28 Views
ప్రింట్ కామెంట్
Jitan_Ram_Manjhi_expelled_from_JDU_niharonline

బీహార్‌లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు షరతులు విధిస్తూ తలనొప్పిగా మారిన జీతన్‌రాం మాంఝీని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఈ అంశమై సోమవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తిరుగు బాటు చేయటం లాంటి చర్యలకు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు. దీంతో బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ త్వరలో బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియరైంది. ఇక 22 మంది మంత్రులు నితీశ్ మద్ధతు తెలపటంతో ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడం లాంఛనంగా మారింది. సోమవారం ఉదయం వరకు బెట్టుతో ఉన్న మాంఝీ ఒక్కసారిగా డిప్యూటీ సీఎం ప్రతిపాదన తేవటంతో సంక్షోభం ముగిసినట్టేనని అంతా అనుకున్నారు. తిరుగుబాటు వెనుక బీజేపీ మద్ధతు ఉన్నట్లు ఆరోపణలు రావటంతో మాంఝీని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు ఈ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించాలని మాంఝీ మద్ధతుదారులు భావిస్తున్నారు. ఇక మాంఝీ, నితీశ్ కుమార్ లలో ఎవరికీ గవర్నర్ ముందుగా అపాయింట్ మెంట్ ఇస్తారో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ