కూతురి ప్రేమ వ్యవహారంలో కేసీఆర్ నిర్ణయం ఏంటో?

May 02, 2016 | 11:49 AM | 2 Views
ప్రింట్ కామెంట్
kcr-adopt-daughter-prathyusha-love-niharonline

తల్లిదండ్రుల చేత తీవ్ర హింసలు ఎదుర్కొని, శరీరమంతా గాయాలతో ఆసుపత్రిలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా కదిలొచ్చేలా చేసిన ప్రత్యూష గుర్తుందా? ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్టు, ఆమె యోగక్షేమాలను తానే స్వయంగా పరిశీలిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు కూడా. ప్రస్తుతం ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం సంరక్షణలో ఉన్న ప్రత్యూష ఇప్పుడు తనను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటోంది. ఓ అటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని తాను పెళ్లి చేసుకుంటానని ప్రత్యూష అధికారులకు చెప్పగా, వారు కేసీఆర్ కార్యాలయానికి సమాచారం అందించారు.

                                  అయితే తాను ప్రేమించిన వాడిని వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రత్యూషను ప్రస్తుతానికి ఆ యువకుడితో కలవనీయవద్దని కేసీఆర్ కార్యాలయం అధికారుల నుంచి మహిళా, శిశు సంక్షేమ విభాగం అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. అతడితో కనీసం మాట్లాడనీయవద్దని కూడా ఆదేశించినట్టు సమాచారం. ప్రత్యూష బాగోగులు స్వయంగా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నందున, ఈ విషయంలో ఆయన అభిప్రాయం తీసుకున్న తరువాతనే ముందడుగు వేయాలని అధికారులు నిర్ణయించారు. తాను ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని ప్రేమించానని, అతనితో తన పెళ్లి జరిపించాలని ప్రత్యూష కోరిన సంగతి తెలిసిందే. ప్రత్యూష పెళ్లిని తానే స్వయంగా జరిపిస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించారు కూడా. ప్రస్తుతం కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్ రాగానే ఈ విషయమై ఓ నిర్ణయానికి రావచ్చని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ