సాగర్ వార్ పై రాజ్ భవన్ శరణువేడిన తెలుగు సీఎంలు

February 14, 2015 | 11:04 AM | 18 Views
ప్రింట్ కామెంట్
KCR_Chandrababu_Narasimhan_niharonline

నాగార్జున సాగర్ నీటి తకరారు రాజ్ భవన్ కు చేరింది. సాగు, తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నీటి పారుదల శాఖాధికారులు తెలంగాణ అధికారులను అడగటంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం నుంచి ఇరు ప్రాంతాల పోలీసులు మోహరించగా, వారు పరస్పరం ఘర్షణ పడిన విషయం విదితమే. అంతేకాదు శనివారం ఉదయం కూడా మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరో 1000 మంది పోలీసులు డ్యాం వద్దకు చేరిన కాపలా కాస్తున్నారు. ఇక నల్గొండ టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో ఏంటోనన్న టెన్షన్ గడియ గడియకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ సమక్షంలో సమస్య పరిష్కారానికి సమావేశమయ్యారు. కాగా, నల్గోండ రైతులు, పోలీసులు భారీ సంఖ్యలో మోహరించగా, ఏపీ పోలీసులు డ్యాంకు పహారా కాస్తున్నారు. సమావేశం నేపథ్యంలో ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ