కేసీఆర్ ఇలాకాలోనే అవినీతి కుంభకోణమా?

March 18, 2016 | 11:25 AM | 2 Views
ప్రింట్ కామెంట్
KCR-CM-relief-fund-scam-niharonline

నవతెలంగాణలో ఏర్పడ్డ తొలి ప్రభుత్వానికి ఏ మచ్చ లేకుండా పాలన కొనసాగిద్దామనుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రయత్నానికి ఆటంకాలు మొదలయ్యాయి. అవినీతి లేని పాలన కొనసాగిదామనుకుంటున్న ఆయన లక్ష్యానికి అవినీతి రాబందులు గండికొడుతున్నాయి.  పాలనపరంగా ఎటువంటి జాప్యం భరించబోనన్న ఆయన స్టేట్ మెంట్ కి అప్పటికప్పుడు వణికిపోయే అధికార గణం వెనకాల గోతులు తవ్వుతూ వస్తున్నారు. ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన బడా అవినీతి బాగోతం బయటపడటం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి వైఎస్ మరణం తర్వాత స్తబ్దంగా ఉండిపోయింది. అయితే తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ తిరిగి దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించగా, ప్రస్తుతం అది అవినీతి చెద పడుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల పేరు చెప్పి రంగంలోకి దిగిన అక్రమార్కులు ఏకంగా రూ.75 లక్షలను జేబులో వేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్న ఈ అక్రమ దందా ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దీనిపై గరం అయిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేశారు. 56 ఆసుపత్రుల పేరు చెప్పుకుని 128 మంది అక్రమార్కులు ఏకంగా రూ.75 లక్షలను తమ జేబుల్లో వేసుకున్నారని గుర్తించారు. వెనువెంటనే ఈ డబ్బును కాజేసినవారిలో తొలి విడతగా 10 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక దర్యాప్తునకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు సీఎం కేసీఆర్ కు అందజేశారు. వారిపై కాస్త సీరియస్ గానే చర్యలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ