ఆంధ్రాలో కలకలం సృష్టించిన కేసీఆర్ ఫ్లెక్సీ

January 09, 2016 | 02:38 PM | 2 Views
ప్రింట్ కామెంట్
KCR-Flexi-in-East-Godavari-District

తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు చెబితే ఒకప్పుడు ఆంధ్ర ప్రజలకు మంట. తమ భాషను, యాసను గేలి చేశారంటూ కేసీఆర్ ప్రత్యక్షంగానే విమర్శలను, వ్యంగాస్త్రాలను సంధించినప్పుడు వారికి మండటంలో తప్పేం లేదు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఆయనపై ఆంధ్రా ప్రజల్లో ఒకింత అనుకూలత ఏర్పడుతూ వస్తోంది. మొన్నామధ్య అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన టైంలో స్టేజీపైన ఆయన మాట్లాడేప్పుడు అక్కడి జనాలు ఇచ్చిన స్పందనే అందుకు నిదర్శనం. రాష్ట్రాలను ముక్కలు చేశారన్న దానికంటే తమ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందేందుకు పరోక్షంగా కేసీఆర్ సహకరిస్తున్నారన్నది వాళ్ల భావన అయి ఉండొచ్చు.  

ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలతో హైదరాబాద్ పింక్ సిటీగా మారిపోయిందని జాతీయ మీడియా  కథనాలు వెలువరుస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికన్నా ఆసక్తికర ఘటన శుక్రవారం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని వై.రామవరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కీర్తిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.

‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల చీకటి జీవితాలకు వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రివర్యులు’ అన్న విశేషణంతో వెలసిన ఆ ఫ్లెక్సీలో కేసీఆర్ కు ‘శతకోటి అభివందనములు’ అని పేర్కొంటూ వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం సరదు ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఫ్లెక్సీలు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును అవమానించినట్లుగానే ఉన్నాయన్న భావనతో వాటిని తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ