కేసీఆర్ ఎమోషనల్ స్పీచ్ తో టచ్ చేశాడు

March 31, 2016 | 03:25 PM | 3 Views
ప్రింట్ కామెంట్
KCR-praises-chnadrababu-in-telangana-assembly-niharonline

దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఫీట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ చేసి చూపారు. అసెంబ్లీ సాక్షిగా ఇరిగేషన్ వ్యవస్థపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. తనకున్న విజన్ మొత్తాన్ని ప్రదర్శిస్తూ ప్రాజెక్టుల గురించి క్లుప్తంగా ఆయన వివరించిన తీరు సీనియర్ ఇంజనీర్ లను సైతం విస్తూ పోయేలా చేసింది. జల విధానంపై త్రీడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఆయన కంప్యూటర్ మౌస్‌ను ఎంతో చాకఛక్యంగా ఆయనే ఆపరేట్ చేశారు కూడా.

ఇది పక్కనపెట్టి అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీ ప్రజలను సైతం ఆకట్టుకునేలా ఆయన మాట్లాడిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.  తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో ఉన్న సన్నిహిత్యం గురించి ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు తనకు ఎప్పటికీ మిత్రుడేనని కుండబద్ధలు కొట్టారు. తాను చేసిన మహాయాగానికి ఆహ్వానించేందకు వెళ్లినప్పుడు ఆయన భోజనం పెట్టారని అన్నారు. బతుకు, బతకనియ్యు అనేది తెలంగాణ ప్రజల సంప్రదాయమని, ప్రజలను మభ్యపెడదామంటే కుదరదని ఆ టైంలో బాబు తనతో అన్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు పలు ప్రాజెక్టుల విషయంలో బాబుకు సలహా ఇచ్చినట్లు, వాటిని ఎంతో ఓపికగా ఆయన విన్నట్లు తెలిపారు. ముఖ్యంగా పోలవరం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు రెండు దిశలకు నీళ్లు వెళ్లేలా ప్రాజెక్టు కట్టాలని చెప్పినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఒక పక్క నుంచి విశాఖపట్టణం వెళ్లే దిశగా నీళ్లు మళ్లించుకోవాలని, అలాగే రెండో పక్క నుంచి రాయలసీమలోని తడవైపు నీళ్లు తరలించాలని చెప్పానని అన్నారు. కేవలం ఇవే కాకుండా మధ్య మధ్యలో చిన్న ప్రాజెక్టులు కొన్ని కట్టుకోవాలని కూడా సూచించానని ఆయన చెప్పారు. చంద్రబాబు ధైర్యం చేసి పట్టిసీమ ప్రాజెక్టును కట్టాడని, అందుకు ఆయనను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు.

                        అందుకే చంద్రబాబుతో ఊరికే తకరారు పెట్టుకోవడం ఎందుకని ఇలా సూచించానని, త్వరలోనే చంద్రబాబును కలిసి పలు ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకుంటానని కేసీఆర్ చెప్పారు. రైతులు ఎక్కడి వారైనా రైతులేనని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆంధ్ర అంటేనే అంత ఎత్తున్న లేచిపడే ఆయన నుంచి, అది కూడా తెలంగాణకు సంబంధించి కీలక అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో చేసిన ప్రసంగం హైలెట్ ఆఫ్ ది డేగా నిలిచిందనటంలో ఎలాంటి సందేహం లేదు. భౌగోళికంగా రెండు రాష్ట్రాలు పక్కనే ఉన్నాయని, తోసేస్తే వెళ్లిపోయే బంధం కాదని కేసీఆర్ చెప్పటం వెనుక భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల సయోధ్య కొనసాగుతుందనటానికి సంకేతంగా నిలిచింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ