నేతలందు కేసీఆర్ తీరే వేరయ్యా

December 14, 2015 | 03:08 PM | 3 Views
ప్రింట్ కామెంట్
andhra-biryani-in-KCR-menu-during-vijayawada-visitniharonline

కాలు జారితే వెనక్కి తీసుకోగలం, కానీ, నోరు జారితే మాత్రం చాలా కష్టమన్నది మనందరికీ తెలుసు. కోపమో, బాధో, ఫ్రస్టేషనో, ఇరిటేషనో తెలీదు గానీ టంగ్ స్లిప్ అయ్యి కొంత మంది చేసే వ్యాఖ్యలు ఆతర్వాత వారికి చేదు అనుభవాలనే మిగుల్చుతాయన్న సంఘటనలు చరిత్రలో కోకోల్లలు. కానీ, తెలంగాణ సీఎం దానికి మినహాయింపు. కట్ చేస్తే... తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ అన్న మాటలు ఓసారి గుర్తు తెచ్చుకుందాం. ‘తెలంగాణలో చేసిందే బిర్యానీ! అసలు సీమాంధ్రుల ముఖాలకు బిర్యానీ చేయడం వచ్చా? ఆంధ్రోళ్ళు చేసిన బిర్యానీ తింటే పేడ తిన్నట్టే ఉంటుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రా సహోదరుల్లో ఆ మాటలు ఆగ్రహం రేకెత్తించాయి. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసిన కోస్తాంధ్ర జిల్లాల ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయి ఏకంగా బిర్యానీ పండుగలే జరిపేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుద్దేశించి సన్నాసి, దద్దమ్మా అనే పదం ఎన్నో సార్లు వాడాడు కూడా.

                             అది ఫ్లాష్ బ్యాక్ మళ్లీ కట్ చేస్తే.... చండీయాగం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానాన్ని అందించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ వెళ్లారు. సన్నాసి అన్న అదే నోటితో అన్నా అంటూ అప్యాయంగా ఆహ్వానం అందించేశాడు కూడా. ఇద్దరు పిచ్చపాటి ముచ్చట్లు కానిచ్చారు. ఇక ఆపై  కేసీఆర్ కోసం ప్రత్యేక విందును చంద్రబాబు సిద్ధం చేశారు. మంచి భోజన ప్రియుడైన కేసీఆర్ కు ఇష్టపమైన పలు ఐటెమ్స్ ను ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మెనూలో మొత్తం 15 రకాల ఐటెమ్స్ ను తయారు చేయించినట్లు చెబుతున్నారు. ఇక ఇందులో ప్రత్యేక ఆకర్షణ ఆంధ్రా బిర్యానీ, ఒకప్పుడు పేడ అన్న అదే నోటితో ఇప్పుడు అవసరం బట్టి విందు భోజనంగా లాగిచేస్తున్నాడు. అవసరమైన సందర్భాల్లో అవసరాన్ని బట్టి అవసరమైన తీరులో వ్యవహారించటంలో కేసీఆర్ రూటే సపరేటూ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ