రాజకీయ గురువు దగ్గరికి సతీసమేతంగా కేసీఆర్!

December 14, 2015 | 11:10 AM | 2 Views
ప్రింట్ కామెంట్
kcr-meets-chandra-babu-at-vijayawada-camp-office-niharonline

తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో త్వరలో ప్రారంభం కానున్న అయుత చండీయాగంకు సంబంధించి ఆహ్వాన పత్రికల పంపకాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆహ్వానించిన కేసీఆర్ మరి అసలు ఇన్విటేషన్ ఎప్పడిస్తారా అని జనాల్లో ఆసక్తి నెలకొంది. అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన కేసీఆర్ ఆ సమయంలోనే తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకి చండీయాగంకు రావాల్సిందిగా మాట తీసున్నారు. ఈ నేపథ్యంలో నేడు (సోమవారం) ఆయన సతీసమేతంగా బెజవాడ వెళ్లి చంద్రబాబును స్వయంగా ఆహ్మానించనున్నారు. ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన హెలికాప్టర్ లో బయలుదేరతారు. నేరుగా క్యాంపు కార్యాలయంకి వెళ్లి కేసీఆర్ కలుస్తారు. దాదాపు గంటన్నర పాటు కేసీఆర్ అక్కడే ఉంటారు. అనంతరం చంద్రబాబు ఏర్పాటు చేసిన విందును ఆరగించిన తర్వాత తన మొక్కును తీర్చుకునేందుకు బెజవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో తాను మొక్కుకున్న మేరకు అమ్మవారికి ముక్కుపుడకను సమర్పించనున్నట్టు తెలుస్తోంది.

                                    ఇక సాధారణ ఆహ్వాన పత్రికలతో పాటు వీఐపీల కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలను తయారు చేయించారు. చండీమాత ముఖచిత్రంతో ఉన్న నాలుగు పేజీల పత్రికలో "జగజ్జనని చండీమాతను ప్రసన్నం చేసుకుని సకల జనాలకు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ పవిత్ర కార్యంగా అయుత చండీ మహాయాగాన్ని తలపెట్టాం" అని, తమరు తప్పక రావాలని కేసీఆర్ తన ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు. ‘చతుర్వేద స్వాహాకార పురస్సర మహారుద్ర పురశ్చరణ సహిత అయుత చండీ మహాయాగం అని పిలువబడే ఈ యాగం నాలుగు రోజుల పాటు జరుగనుంది. యాగం నిర్వహించే ప్రాంతానికి ఎలా వెళ్లాలి? పార్కింగ్ ఎక్కడ? భోజనం, వసతి సదుపాయాలు ఎక్కడుంటాయి? తదితర వివరాలతో కూడిన మ్యాప్ ను నాలుగో పేజీలో ముద్రించారు. ప్రస్తుతం తెలుగు మీడియా కళ్లన్నీ ఇద్దరు చంద్రుళ్ల కలయికపైనే ఉన్నాయి మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ