కేసీఆర్-నరసింహన్ ఏం చేద్దామనుకుంటున్నారు

April 09, 2016 | 05:00 PM | 2 Views
ప్రింట్ కామెంట్
KCR_meet_narasimhan_for_cabinet_reshuffle_niharonline

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం రహాస్య భేటీ కానున్నారు.  ఉన్నట్లుండి అకస్మాత్తుగా ముఖ్యమంత్రి వెళ్లి గవర్నర్ ను కలవటంపై పలు ఊహాగానాలు వినపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా టీఆర్ఎస్ లో చేరిన వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో పాటు ప్రస్తుతం క్రియాశీలంగా వ్యవహరించని మంత్రుల శాఖల్లో మార్పులు చేసేందుకు ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది.

                         అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో ఆయన పలు మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం అందులో భాగంగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈసారి మార్పుల్లో మహిళలకు చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సన్నిహితులు, సీనియర్లతో సంప్రదింపులు చేసినట్టు సమాచారం. గవర్నర్ ను కలిసి అందుకు తగ్గ ముహూర్తం కోసం చర్చించనున్నట్టు వూహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేఫథ్యంలోనే ఆయన గవర్నర్ ను కలవనున్నారని భోగట్టా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ