మహేష్ మేనియాను వాడుకోనున్న కేసీఆర్ ?

February 12, 2015 | 01:43 PM | 32 Views
ప్రింట్ కామెంట్
kcr_likely_to_appoint_hyderabad_brand_ambassador_mahesh_niharonline

హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారనడంలో సందేహాం లేదు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఓ కీలక సమాచారం అందుతోంది. హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబును నియమించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు వచ్చాయి. దీంతో నగర బ్రాండ్ వ్యాల్యూ పెంచేందుకు కేసీఆర్ చూపు తాజాగా మహేష్ బాబు వైపు దృష్టి సారిస్తున్నారని తెలియవస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న మహేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటం వల్ల అందరి ద్రుష్టిని ఆకర్షించవచ్చునని తద్వారా పెట్టుబడులను, అభివ్రుద్ధి విషయాల్లో ఢోకా ఉండదన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలియవస్తోంది. మరోవైపు త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్స్ ల ద్రుష్టిని ఆకర్షించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం అక్కడా విపరీతమైన క్రేజ్ ఉన్న మహేష్ ను వాడుకోవాలని చూస్తున్నారట. అదండీ అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. అంతేకాదండోయ్ కేసీఆర్ కి మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడనే వారంతా అనుకుంటున్నారట. మరీ మహేష్ ముందుకు వస్తాడా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ