నారాయణ ఖేడ్ గెలుపుపై కేటీఆర్ ఏమన్నాడంటే

February 16, 2016 | 12:13 PM | 5 Views
ప్రింట్ కామెంట్
ktr-narayankhed-by-poll-win-harish-rao-niharonline

తెలంగాణలో కారు స్పీడు వేగం అస్సలు తగ్గట్లేదు. ఊహించినట్లుగానే నారాయణ ఖేడ్ ఉపఎన్నికల్లో గులాబీ అభ్యర్థి 50వేల ఆధిక్యంతో గెలుపోందారు. సానుభూతి పవనాలను కూడా కాదని కాంగ్రెస్ కు చెయ్యిచ్చి అభివృద్ధి కోసం అధికార పార్టీకే పట్టంకట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి స్వర్గీయ పటోళ్ల కృష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని కాదని మరి టీఆర్ఎస్ అభ్యర్తి భూపాల్ రెడ్డికి భారీ విజయాన్ని అందించారు అక్కడి ప్రజలు. ‘గెలుపు సారధి’గా పేరొందిన హరీష్ రావు బరిలోకి దిగటం, ఇంతవరకు ఏ నేతలు కూడా తిరగని గ్రామాల్లో సంచరించి, దత్తత నినాదంతో ఆకర్షించటంలో హరీష్ సక్సెస్ అయ్యారు. ఇక తెలంగాణలో ఉనికి కోల్పోయే ప్రమాదంలోపడ్డ టీడీపీ ఇక్కడ కాస్తలో డిపాజిట్ గల్లంతయ్యే అవకాశం నుంచి తప్పించుకుంది.

ఇక గెలుపుపై వేగంగా స్పందించిన టీఆర్ఎస్ యువనేత, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పార్టీ అభ్యర్థి విజయంపై ట్వీట్ చేశారు. తన బావ, భారీ నీటిపారుద శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు మెదక్ జిల్లా పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్విట్టర్ లో ప్రత్యేక కామెంట్లను పోస్ట్ చేశారు. 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారని ఆయన ఆ పోస్టుల్లో పేర్కొన్నారు. హరీష్ రావులాంటి నేతలు ఎక్కడ ఉంటే గెలుపు అక్కడుంటుందని పేర్కొన్నాడు. గ్రేటర్ గెలుపులో భాగస్వామి కాలేకపోయిన హరీష్ రావు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కాబట్టే భారీ మెజార్టీ సాధ్యమయ్యింది.

మొత్తం  టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 93,076 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 39,451 ఓట్లు పోలయి డిపాజిట్ దక్కించుకోగలిగాడు. దీంతో భూపాల్ రెడ్డి 53,625 ఓట్లతో విజయ సాధించినట్లయ్యింది. టీడీపీ నుంచి పోటీలోఉన్న విజయపాల్ రెడ్డికి కేవలం 14,787 ఓట్లు పడ్డాయి. వీరితో పాటు మరో ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ