వస్తుమార్పిడి పద్ధతిలో ప్రాణాలు రక్షించొచ్చా?

August 10, 2015 | 04:37 PM | 3 Views
ప్రింట్ కామెంట్
kambampati_wrong_statement_on_telugu_teachers_libiya_niharonline

లిబియాలో కిడ్నాపైన ఇద్దరి లెక్చరర్ల్ ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేరు. సుష్మాస్వరాజ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానని ఆయన హామీ ఇచ్చేరు. దుండగుల చెర నుంచి విడిపిస్తానని మాట ఇచ్చేరు. ఆ దుర్మార్గులు పచ్చి రక్తం తాగే బాపతయినప్పుడు చర్చల వలన ప్రయోజనం ఉంటే మంచిదే. అంతా అల్లా దయ. కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందోనని బెంగటిల్లి పోతోంటే... సుష్మనడుగుతాను, వివరాలు తెలుసుకుంటాను అనే మాటలు ఓదార్పునివ్వవు.

                                   కంభంపాటిని పిలిచి నువ్వే ఆధారంతో వాళ్లు విడుదలయిపోయారు అని తప్పుడు స్టేటుమెంటు ఇచ్చావయ్యా అని అడిగి వివరాలు సేకరిస్తే బావుంటుంది. దేశ ప్రజలకి, ఆ ఫ్యామిలీకి భరోసాకలిగేలా ఓ త్యాగమూర్తి సెంటి మెంటు పండించి తప్పుదారి పట్టించే ప్రకటన చేసినందుకు కమ్మంపాటిని లిబియా పంపించి అందాకా మీ దగ్గరుంచుకోండి, మా ఇద్దరి టీచర్లను వాపసిచ్చేయండి అని బతిమాలుకుంటే ఏమైనా పని జరుగుతుందా? తప్పంటారా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ