చిన్న చేపలతో సొర చేపలను టార్గెట్ చేయమంటున్నాడు

February 21, 2015 | 12:11 PM | 37 Views
ప్రింట్ కామెంట్
CM_aravind_Kejriwal_Corporate_Espionage_case_niharonline

దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కార్పోరేట్ గూఢచర్యం కేసులో చిన్నస్థాయి ఉద్యోగులపై కాకుండా అసలు బడా నేతలను పట్టుకుని విచారించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించాడు. ట్విట్టర్లో ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆయన సూచించాడు. అరెస్ట్ చేసిన చిన్నస్థాయి ఉద్యోగుల నుంచి కీలక సమాచారం రాబట్టి దీనివల్ల లబ్ధి పొందిన బడాబాబులను గుర్తించాలని ఆయన కోరారు. వేగంగా స్పందించి ప్రముఖ కంపెనీల బాగోతాలను బయటపెట్టిన పోలీసులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. చిన్న పిట్టలను విచారించి పెద్ద పిట్టలను పట్టుకొని చమురు మురికి వదిలించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటిదాకా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, శనివారం కూడా ఈ అరెస్ట్ లు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కార్పొరేట్ గూఢచర్యానికి పాల్పడ్డాడన్న అభియోగాలతో అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో రిలయన్స్ ఉద్యోగి కూడా ఒకరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన కీలక పత్రాలను దొంగిలించి వాటిని కార్పొరేట్ కంపెనీలకు అప్పజేప్పాడని అతనిపై ప్రధాన అభియోగం. ఇక తమ ఉద్యోగి అరెస్ట్ విషయాన్ని రిలయన్స్ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ