ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ తరపున మేనిఫేస్టోను ఆప్ విడుదల చేసింది. మీడియా సమావేశం ఏర్పాటుచేసి కార్యకర్తల సమక్షంలో సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ మేనిఫెస్టో పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఢిల్లీ సమగ్ర అభివ్రుద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ఆప్ ఎన్నికల ప్రణాళికను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ ప్రజలకు దిశానిర్ధేశం చేసేలా తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. బీజేపీ ఎన్నికల హామీలిచ్చేందుకు భయపడుతోందన్న కేజ్రీ, గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. మహిళా రక్షణ, మంచినీరు, నగరంలో విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అజెండాలో ఆయన ప్రధానంగా ద్రుష్టిసారించారు. కాగా తాము అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఢిల్లీ జన లోక్ పాల్ బిల్లును పాస్ చేస్తామని హామిని ఇచ్చింది. ఇక బీజేపీ మేనిఫెస్టో లేకుండానే ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.