దొందూ దొందే: ఆ రెండింట్లో అభ్యర్థులు నేరచరితులే

January 31, 2015 | 12:02 PM | 24 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిజాయితీ పరులైన వారికి అధికారం కట్టబెడదామనుకున్న ఓటర్లకు నిరాశే ఎదురయ్యేట్లుంది. ఎన్నికల్లో పార్టీలు అంగ, అర్థ బలాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. నయానో భయానో ఓట్లను రాబట్టే గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చాయి. గెలుస్తాడనుకుంటే చాలు... అభ్యర్థి నేర చరిత్రను పక్కనబెట్టి మరీ వారికి సీట్లు ఒప్పజెప్పాయి. ఈ విషయంలో రాజకీయాలను ప్రక్షాళన జేస్తామన్న ఆమ్ ఆద్మీ కూడా ఏం తీసిపోలేదు. ఆ పార్టీ టికెట్లు ఇచ్చిన వారిలో 23 మంది పలు క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వారే. ఇక బీజేపీ విషయానికొస్తే 29 మంది నేర చరితులకు ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. అంతగా ఆశలు లేని కాంగ్రెస్ ఏమో 21 మందికి కేటాయించింది, మొత్తం 673 మంది అభ్యర్థలు ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేయగా, వీరిలో 17 శాతం మందిపై వివిధ క్రిమినల్ కేసులు ఉన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ