గులాబీ దళం యువరాజుకే పార్టీ పగ్గాలు

April 15, 2015 | 10:40 AM | 42 Views
ప్రింట్ కామెంట్
KTR_TRS_working_president_niharonline

కాంగ్రెస్ పార్టీ లో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యువరాజుగా జేజేలు అందుకుంటుంటే... ఇప్పుడు తెలంగాలోనూ ఓ యువరాజు పుట్టుకొస్తున్నాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24 న జరగబోయే పార్టీ ప్లీనరీలో భాగంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రచారం ఇప్పటిదేం కాదు. గత ఆరు నెలలుగా ఈ వార్త నానుతూనే ఉంది. ఓ వైపు పార్టీ పగ్గాలు మరో వైపు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి రావటంతో ఆయన పాలనపై సరిగ్గా దృష్టిసారించలేకపోవటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు పార్టీ శ్రేణుల్లో కూడా ఎవ్వరి నుంచి కూడా అభ్యంతరాలు రాకపోవటంతో ఇక కేటీఆర్ ఎంపిక లాంఛనం కానుంది. ప్రస్తుతం కేటీఆర్ కేసీఆర్ తర్వాత స్థాయి నేతగా మన్ననలు అందుకుంటున్నాడు. ఇక ఈ భాద్యతలు స్వీకరిస్తే ఆయన ప్రాబల్యం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అధికారికంగా నిర్ణయం వెలువరించే వరకు సస్పెన్స్ కొనసాగిద్దామనుకున్నప్పటికీ అనుచరుల ద్వారా ఆ సమాచారం బయటకు పొక్కింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ