అభినందన వెల్లువలపై ఆప్ అధినేత అసంతృప్తి?

February 16, 2015 | 03:13 PM | 24 Views
ప్రింట్ కామెంట్
hoarding_congratulating_aam_aadmi_party_niharonline

ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ గద్దెనెక్కిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విజయంపై నగరవ్యాప్తంగా సంబరాలు వెలువెత్తుతున్నాయి. అయితే దీనిపై ఆయన అసంత్రుప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటారా?... ఆప్ ను అభినందిస్తూ పోస్టర్లు వెలియటం. అది ఆయనకు అస్సలు నచ్చట్లేదట. విజయం సాధించిన మమల్ని అభినందిస్తూ పలువురు నగరవ్యాప్తంగా పోస్టర్లను ఏర్పాటుచేశారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ తరహా గ్రీటింగ్ పాలిటిక్స్ కు మేం వ్యతిరేకం. గెలుపు సంబరాలు చేసుకోవాలంటే వలంటీర్లు ప్రజాసేవలో నిమగ్నం కండి’’ అంటూ ఆయన ఫేస్ బుక్ లో పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ పెట్టిన ఈ పోస్టింగ్ ను కేవలం గంట వ్యవధిలోనే 14,000 మంది లైక్ చేయటంతోపాటు ఇతరులకు షేర్ చేశారు. ఇక జ్వరం నుంచి కోలుకోవటంతో ఆయన ఆ రోజు తన తొలి కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యారని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ