కేజ్రీ ‘జంగ్’ ఓ ఆరని చిచ్చు

December 26, 2015 | 11:13 AM | 1 Views
ప్రింట్ కామెంట్
LG_Najeeb_Jung_Kejriwal_DDCA_probe_Niharonline

అప్పుడెప్పుడో అధికారాల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, లెప్ట్ నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్ ల మధ్య మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిరువు గప్పిన నిప్పులా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వీరిద్దరు మళ్లీ రాజకీయాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి గొడవకు ఆజ్యం పోసింది ఢిల్లీ క్రికెట్ పంచాయితీ. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య డీడీసీఏ వివాదం పెద్ద అగాధాన్నే ఏర్పరచిందని చెప్పాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి డీడీసీఏ అవకతవకల్లో ప్రత్యక్ష ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను కూడా ఏర్పాటు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

 

                          అయితే, ఈ కమిషన్ చట్టవిరుద్ధమని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మొన్న కేంద్రానికి ఓ నివేదిక పంపారు. దీనిపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తన రాజకీయ గురువులను కాపాడే పనిలో జంగ్ మునిగిపోయారని ఆక్షేపించారు. గవర్నర్ పదవిలో ఉన్న జంగ్ ఈ తరహా చర్యలకు పాల్పడటం తగదని కూడా కేజ్రీ వ్యాఖ్యానించారు. ‘‘జంగ్ పొలిటికల్ బాస్ జైట్లీ. బాసును కాపాడుకునే పనిలో జంగ్ నిమగ్నమయ్యారు’’ అంటూ కేజ్రీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరంలేదంటూ గతంలో జంగ్ బహిరంగగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే జంగ్ చాలా మంచి వాడని, ఆయన వెనుకున్న దుష్టశక్తులే(కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి) ఆయనతో ఇలాంటి పనులు చేయిస్తున్నాయని గతంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించాడు కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ