ఆడపాదడపా పార్టీ కార్యక్రమాలకు, అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరైనప్పటికీ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పూర్తిస్థాయిలో రాజకీయ రంగంలోకి దిగలేదనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన హక్కులపై కేంద్రంతో పోరాడేందుకు సిద్ధంకావాలని ఆయన ఎంపీలకు పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ లను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి నిధులు, రాయితీలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి విజ్ణప్తి చేశారు. అలాగే అవసరమైన నిధుల కోసం ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని బాలయ్య పేర్కొన్నాడు. ఇప్పటిదాకా బాలయ్య బాబు ఏపీ హక్కుల కోసం కానీ, మరేయితర అంశాల కోసం కానీ స్పందించింది లేదు. అలాంటింది మొదటిసారిగా ఆయన పెదవి విప్పి మాట్లాడటంతో పార్టీ శ్రేణుల్లో సైతం కొత్త ఉత్సహాం నింపినట్లైంది. అలాగే నూతన రాజధానిలో భూకేటాయింపు చేస్తే బసవతారకం కేన్సర్ ఆస్పత్రిని నిర్మించేందుకు ముందుకు వస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.