మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ప్రతిష్టంబన తెలిసిన విషయమే. ఆచూకీ తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం చేతగాని తనం ప్రదర్శిస్తుందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయ. కాగా, గత వారం హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదురి దావూద్ ఎక్కడున్నాడో తెలీదంటూ ప్రకటన చేయటం ఇంకా విమర్శలకు తావునిచ్చింది. ఇక లాభం లేదనుకొని స్వయంగా హెంశాఖ రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని, ఎట్టి పరిస్థితుల్లో అతన్ని భారత్ కు రప్పించి తీసుకువస్తామని సోమవారం ఆయన ప్రకటించారు. ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నాడని స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ విషయంలో సహకారం అందించిందా సరేసరి, లేదా ఒత్తిడి తీసుకువచ్చైనా సరే దావూద్ వ్యవహారం తేలుస్తామని రాజ్ నాథ్ కరాఖండిగా చెప్పారు.