రాజకీయాలకు కొత్త... ముఖానికి మేకప్ వేసుకున్న వారి పరిస్థితి ఏంటో తెలుసు కదా... ఈయన పరిస్థితి కూడా అంతే అని పెదవి విరిచారు. కానీ, రాజకీయాలు మా బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫుల్ అని కౌంటర్ ఇస్తూ ముందుకు పోతున్నారు నందమూరి బాలకృష్ణ. పాలిటిక్స్ అంటే కేవలం రాజకీయాలు చెయ్యటమే కాదు... ప్రజా సేవ కూడా అన్నది మైండ్ లో పెట్టుకుని పని చేస్తున్నాడు. ఎన్నికల తర్వాత కొన్నిరోజులపాటు విమర్శలు రావటంతో ప్రారంభమైన బాలయ్య పర్యటనలు వరుసపెట్టి జరుగుతున్నాయి. ఇంతకుముందు నెలకొకసారి పర్యటించిన ఆయన ఇప్పుడు రెండు మూడు రోజులకోకసారి నియోజకవర్గం హిందుపురంలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు వారానికో మంత్రిని ఇప్పుడు చర్చగా మారింది. రాజకీయంగా ఎదుగుదలకేనా ఆయన కలిసేది అన్న అనుమానాలు మిగతా నేతల్లో చోటుచేసుకుంది. దీనిపై ఆరా తీస్తే అలాంటి చిల్లర పనులకు తాను ఎన్నడూ పాల్పడనని చెప్పుకొచ్చాడు బాలయ్య.
వివిధ శాఖలకు చెందిన మంత్రులను పట్టి వారి ద్వారా సాధ్యమైనంతగా నిధులను ఆయన పట్టేస్తున్నారు. నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చెయ్యటంతోపాటు, ప్రారంభోత్సవాల్లో కూడా బిజీ బిజీ అయిపోతున్నాడు. గత వారం మంత్రి అచ్చెన్నాయుడును కలిసి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. అది మంజూరు చేయించుకున్న బాలయ్య తాజాగా మంగళవారం మరో మంత్రి అయ్యనపాత్రుడిని కలిశారు. అభివృద్ధి పనుల నిమిత్తం రూ.30 కోట్ల ప్రతిపాదనలను ఆయనకు సమర్పించాడు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న బాలయ్య, హిందూపురాన్ని బెంగళూరు హైవేతో అనుసంధానం చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు వివరించాడు. అంతేకాదు తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ కలల ప్రాజెక్ట్ హంద్రినీవా కోసం బాలయ్య చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. మొత్తానికి ఇప్పుడున్న మంత్రులు, నేతలు బాలయ్య చూసి బుద్ధి తెచ్చుకుంటే చాలా మంచిది. ఇది మంత్రులతో బాలయ్య మంతనాల వెనుక ఉన్న మర్మం.