హోదాపై కేంద్రానికి బాలయ్య వార్నింగ్

October 26, 2015 | 05:41 PM | 2 Views
ప్రింట్ కామెంట్
balakrishna_warns_central_govt_about_AP_special_status_niharonline

రాజధానియే కాదు, కనీస మౌళిక వసతుల కల్పన కూడా లేకుండా ఏర్పడిన ఏపీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిందేనంటున్నారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తనకుందని, ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందని, తమ అధినేత చంద్రబాబు కలిసిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే విన్నవించుకుంటున్నారని తెలిపారు.

ప్యాకేజీలతోపాటు ప్రత్యేక హోదా కూడా రాష్ట్రానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకేవేళ అలా కానీ పక్షంలో కేంద్రానికి ఎదురెళ్లే సత్తా తమకుందని ఆయన ప్రకటించారు. ఎవరెన్నీ విమర్శలు చేసినా చెయ్యాల్సిన అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. అనవసర రాద్ధాంతం చెయ్యకుండా ప్రభుత్వంతో కలిసి రాజధాని నిర్మాణానికి కృషి చెయ్యాలని విపక్షాలను ఆయన కొరారు.  వితండవాదాలతో జనాల్లో చులకన కావొద్దని వైకపా అధినేత జగన్ కు పరోక్షంగా ఆయన చురకలు అంటించారు.
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాల మహానాడు నేత కారెం శివాజీ స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. బాలయ్య లాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా హోదాపై గళం విప్పాలని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కోరారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ