టీ ఉద్యమం ఆంధ్రా పుస్తకాలలోనా! అది అయ్యేపనేనా అక్కా?

February 20, 2015 | 04:51 PM | 68 Views
ప్రింట్ కామెంట్
kavitha_demands_AP_govt_in_books_niharonline

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓ వింతైన వాదనను తెరపైకి తెస్తున్నారు. అదేంటంటే... ఆంధ్ర ప్రదేశ్ లోని పిల్లలు చదివే పాఠ్యపుస్తకాలలో తెలంగాణ ఉద్యమం గురించి చేర్చాలని. హైదరాబాద్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ఏపీలో పిల్లలు చదివే పాఠ్యపుస్తకాలలో తప్పని సరిగా తెలంగాణ ఉద్యమం గురించి ముద్రించాలట. ఇందుకు సంబంధించి అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చోరవ తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. తెలుగు ప్రజలంతా ఒక్కటేనంటున్న చంద్రబాబు ఇక్కడి ప్రజల మనోభావాల్ని గౌరవించి ప్రజా ఉద్యమాన్ని అక్కడ పిల్లలకి బోధించేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇంతకాలం ఇక్కడి విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర గురించి దాని ప్రాభావ్యం గురించే చదువుకున్నారని, దాని వల్ల తెలంగాణ చరిత్ర, సంస్క్రుతిని ఆంధ్రాపాలకులు మరుగుపరిచారని ఆమె అంటున్నారు. కవిత ప్రతిపాదన కరెక్టే అయినప్పటికీ ఆచరణలో అది సాధ్యమయ్యేదేనా. కష్టమే కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ