ట్విస్ట్ లతో ఉత్కంఠ రేపుతున్నబీహార్ రాజకీయాలు

February 19, 2015 | 05:41 PM | 54 Views
ప్రింట్ కామెంట్
Patna_HC_shocks_to_Manjhi_niharonline

బీహార్ రాజకీయాలు క్షణక్షణానికి ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా గురువారం ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి పాట్నా హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. జేడీయూ కు చెందిన ఎనిమిది మంది రెబల్ అభ్యర్థుల ఓటు వేసే అవకాశాన్ని రద్దుచేస్తూ హైకోర్టు డబుల్ బెంచ్ ఆర్డర్ జారీ చేసింది. దీంతో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డట్టయింది. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా సంభవించిన ఈ పరిణామం మాంఝీకి పెద్ద ఎదురు దెబ్బ. ఫిబ్రవరి 20న విశ్వాస పరీక్షను ఎదుర్కో బోతున్న తరుణంలో కోర్డు ఆర్డర్ గణనీయమైన ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే నితీష్, మాంఝీ ఇద్దరూ తమ బలాన్ని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు అవసరమయితే మాంఝీకి బయటి నుంచి మద్ధతిస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పకనే చెప్పింది. దీంతో ఆరోజు ఏం జరగబోతుందోనన్న టెన్షన్ నెలకొంది. మరోవైపు జేడీ(యూ) ప్రధాన ప్రతిపక్షహోదా కల్పిస్తూ ఆ రాష్ట్ర స్పీకర్ ఉదయ నారయణ చౌదరి నిర్ణయం ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ