కొట్లాట అయితేనే కాంప్రమైజ్ అవుతారా?

February 14, 2015 | 03:01 PM | 23 Views
ప్రింట్ కామెంట్
gutta_Sukender_reddy_fires_on_both_telugu_CM_niharonline

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల విషయంలో పోలీసులు తన్నుకుంటే కానీ చర్చలు రారా? అని కేసీఆర్, చంద్రబాబులపై నల్గోండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగే ఘర్షణకు ఇరు సీఎంలే కారణమని ఆయన ఆరోపించారు. గొడవలు ముదిరిన తర్వాతే ఇద్దరు రాజీకి వచ్చారని, అంటే ప్రజల ఇబ్బందులు వారికి పట్టవా అని ఆయన ప్రశ్నించారు. తక్షణం ఎడమకాల్వ నుంచి నీటిని విడుదల చేయకపోతే 2.50 ఎకరాల్లో పంట ఎండిపోతుందని ఆయన చెప్పారు. రైతుల ప్రయోజనాలు తాకట్టుపెట్టి ఇరువురు రాజకీయాలు చేస్తున్నారన్నారు. పంటలు ఎండిపోతే కనుక బాధ్యత మీరే వహించాలని ఆయన కేసీఆర్, చంద్రబాబులను హెచ్చరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ