కవితక్కా... రచ్చ గెల్వాలంటే ఇంట గెల్వాలె!

August 20, 2015 | 05:54 PM | 2 Views
ప్రింట్ కామెంట్
MP_kalvakuntla_kavitha_on_liquor_ban_in_telangana_niharonline

ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని ధాటీగా మాట్లాడటంలో చంద్రశేఖర్రావుగారి బిడ్డ కవితమ్మ ఆరింది, తేరింది. ఎలాంటి విమర్శనైనా అడ్డుకుని నాన్నగారి ఇలాకాలో మంచి పేరు సంపాదించుకుంది. రాష్ట్రంలోనే కాదు దేశ రాజధాని లో కూడ గొంతు వినిపించి శభాష్ అనిపించుకుంటోంది. డాడీ దగ్గర బొలెడంత సాహిత్యం, గ్రంథాలయం ఉన్నది ఊరకనే పోతుందా?

                                       సీజనల్ గా సీఎంగారు ప్రజలకీ, ప్రతిపక్షాలకీ ఏదో వ్యాపకం కల్పిస్తుంటారు. హుస్సేన్ సాగర్ గట్టు మీద బహుళాంతస్తులు, లేకపోతే సెక్రటేరియేట్ షిఫ్టింగ్, ఉస్మానియా ఆస్పత్రి ఉసురు తీయడం లాంటివన్నమాట. వీరందరికీ చీప్ లిక్కరుకి పురుడోసి, గుడుంబాకి గోరీకట్టడం అనే కాన్సెప్టు తో మేత కల్పించేడు. ఇక చూడండి విమర్శెంత దూరం పోయినయ్యంటే అందర్నీ ఆయనలానే తయారు చేద్దామనుకుంటున్నాడని. ఎవరెలా వ్యాఖ్యానిస్తారో సారుకి తెలియక కాదు. ఏదో ఉడుతా భక్తిగా కవితమ్మ కూడ ప్రభుత్వాన్ని సమర్థించే ప్రయత్నం చేసింది. మద్యపానాన్ని నిర్మూలించడం ఎవరి తరం కాదు... నియంత్రించేందుకు తక్కువ రేటులో నిఖార్సయిన చీప్ లిక్కర్ని అందించే ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. ఆ రకంగా గుడుంబా అరికట్టలేకపోయినప్పుడు ప్రతిపక్షాల విమర్శలతో ఏకీభవిస్తానని చెప్పింది. ఏకీభవిచడం వేరు ఛీప్ లిక్కర్ కాన్సెప్ట్ ని తుంగలో తొక్కడం వేరు!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ