మల్లు చెప్పిందానికి అస్సలు ఒప్పుకోరు

April 20, 2016 | 12:17 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Mallu_bhatti_vikramarka_KCR_paleru_by_poll_niharonline

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు నగరా మోగింది. టీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 22 నుంచి నామినేషన్ల దాఖలు మొదలు కాగా, 29 కి తుది తేదీగా ప్రకటించింది, మే 16న ఎన్నిక జరగనుంది.

సాధారణంగా పదవిలో ఉండగా చనిపోయిన ప్రజా ప్రతినిధుల స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో చనిపోయిన నేత కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యుల్లోని ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది.  కానీ, మొన్నామధ్య జరిగిన నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికతో టీఆర్ఎస్ దానికి స్వస్తి చెప్పింది. ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికలో తన అభ్యర్థిని నిలబెట్టి ఘన విజయం సాధించింది.

                          అయితే పాలేరు విషయంలో ఆ సీన్ రిపీట్ కానివ్వద్దని కాంగ్రెస్ విజ్ణప్తి చేస్తోంది. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఖాళీ అయిన పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలను ఏకగ్రీవంగా ముగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాము అధికార టీఆర్ఎస్ తో చర్చిస్తామని ఆయన తెలిపారు. ఏకగ్రీవానికి టీఆర్ఎస్ ఒప్పుకుంటే సరేసరి, లేదంటే విపక్షాలన్నింటినీ ఒక్కదరికి చేర్చి అధికార పార్టీపై ఉమ్మడి పోరుకు దిగుతామని ఆయన ప్రకటించారు. మంచి సానిహిత్యం ఉన్న కృష్ణారెడ్డి విషయంలోనే వెనక్కి తగ్గని కేసీఆర్ ఇప్పుడు రాంరెడ్డి విషయంలో మాత్రం వింటారా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ