‘వైరా’గ్య ఎమ్మెల్యే: కారెక్కి పెద్ద తప్పు చేశాడట

February 13, 2015 | 01:04 PM | 29 Views
ప్రింట్ కామెంట్
Vaira_MLA_dissatisfaction_over_TRS_joining_niharonline

తెలంగాణలో గులాబీ దళంలోకి చేరిన జంప్ జిలానీల సభ్యులకు అసంత్రుప్తి మొదలైనట్లు కనిపిస్తోంది. వర్గపోరు వారికి పెద్ద తలనోప్పులుగా తయారు అవుతున్నాయి. తాజాగా వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నపార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తొలి మూర్ఖుడిని తానేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైరాలో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులకు, అదే పార్టీకి చెందిన మరో గ్రూప్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఇక ఆయన ఆపుకోలేక తన ఆవేదనను వెల్లగక్కారు. అనవసరంగా వైఎస్సార్సీపీ ని వీడి తెరాసలో చేరానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించాడట. తెలంగాణ లో వైసీపీ కి భవిష్యత్ ఉండదనే ఆలోచనతో తాను టీఆర్ ఎస్ లో చేరానే తప్ప మరో ఉద్ధేశ్యం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నంత కాలం ఏనాడు అభాసుపాలు కాలేదు. ఎవరూ విమర్శించలేదు. కానీ, ఇప్పుడు అనిపిస్తోంది వైసీపీని వదిలి తెరాసలో చేరిన తొలి మూర్ఖుడిని తానేనని వ్యాఖ్యానించారు. నలుగురిని వెనకాలేసుకోని అనవసరంగా విమర్శలు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే బహిరంగ క్షమాపణ చెబుతా, అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుంటా అని ఆయన ఉద్వేగానికి లోనైయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ