సంక్రాంతికే గ్రేటర్ ఎన్నికలు కేసీఆర్ కుట్ర?

November 02, 2015 | 03:40 PM | 2 Views
ప్రింట్ కామెంట్
marri-shasidhar-reddy-fires-on-KCR-on-GHMC-elections

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా మరోకసారి కూడా వాయిదా వేయించుకుంది. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏం లేదంటూ పార్టీ కేడర్ కు ధైర్యం నూరిపోస్తున్న అధినేత కేసీఆర్ ఎందుకనో రాజధాని ఎన్నికలపై మాత్రం వెనకడుగు వేస్తున్నారు. సరైన నేతలు లేకపోవటం, ఉన్నవారికి కూడా పెద్దగా పరపతి లేకపోవటంతో కాస్త జంకుతున్నారు. కీలకంగా భావిస్తున్న గ్రేటర్ ఎన్నికల్లో గనక ఓటమిపాలైతే పాలనాపరంగా మొత్తానికే ప్రభావం పడుతుందన్న భావనలో ఆయన ఉన్నారు. అందుకే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే జనవరిలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సంకేతాలు ఆయన పంపారు. దీంతో కాచుకు కూర్చున్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఆయనపై విరుచుకుపడింది.

కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీమాంధ్రులు అధికంగా ఉన్న హైదరాబాద్ లో సంక్రాంతి సమయంలో ఎన్నికలు నిర్వహించటంలో పెద్ద కుట్ర ఉందని ఆయన చెబుతున్నారు. హైదరాబాద్ లో 35 శాతం మంది సీమాంధ్ర ప్రజలే ఉన్నారు. వారు ఓట్లు వెయ్యకుండా ఉండేందుకే సంక్రాంతి సమయంలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని విమర్శించారు.

ఆంధ్ర వాళ్ల కాళ్లలో ముళ్లు గుచ్చితే తన పంటితో తీస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆ ముళ్లును వాళ్ల గుండెలో గుచ్చుతున్నాడని విమర్శించాడు. అంతేకాదు ఓట్లను గల్లంతు చేయటం, ఇష్టం వచ్చినట్టు గ్రేటర్ వార్డుల విభజన చేశారని ఆరోపించారు. గ్రేటర్ ఓట్ల తొలగింపుపై ఈసీ నిర్ణయం తీసుకునే వరకు వార్డుల విభజన నోటిఫికేషన్ ఆపాలని ఆయన కోరారు. కో-ఆప్టెడ్ సభ్యులను నియమించుకోవడం కుదరదన్న కారణంతో వార్డుల సంఖ్య పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. మొత్తానికి ఈ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్ఛితంగా సత్తా చూపుతుందని ఆయన నొక్కి చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ