ఫ్రాన్స్, జర్మనీ పర్యటనలో బిజీగా ఉన్న ప్రధాని మోదీ పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. మోదీ తన 9 నెలల పాలనలో తనకు 11 విదేశీ పర్యటనలు తప్ప మరేమీ కనబడటం లేదని ఆమె విమర్శించారు. దేశాలు పట్టుకు తిరిగితే ఇండియాను ఎవరు చూడాలని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భూసేకరణ బిల్లు విషయంలో మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ పాలన గాడితప్పుతోందని ఆమె అన్నారు. సీబీఐ ప్రస్తుతం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోందని, ప్రధాని డిపార్డ్ మెంట్ గా మారిందని విమర్శించారు. ఆయన ఆదేశాలతోనే సీబీఐ తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తోందని ఆగ్రహాంతో ఊగిపోయారు.