గొడ్డు మాంసం కోసం నేతల లొల్లి

May 27, 2015 | 01:28 PM | 19 Views
ప్రింట్ కామెంట్
Kiren_Rijiju_naqvi_beef_niharonline

ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం గోమాంసం నిషేధం విధించటం పలువురికి ఇబ్బంది కలిగించిందనే చెప్పాలి. జూలో జంతువులే కాదు, కొందరు మాంస ప్రియులు కూడా అక్కడ అల్లాలాడిపోతున్నారు. అయితే అలాంటి వారిని పచ్చడి పచ్చడి కింద దంచి పాకిస్థాన్ కో, లేక అరబ్ దేశాలకో పంపాలని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి దారితీశాయి. అయితే దీనిపై సొంత పార్టీ నేత నుంచే నక్వీకి పంచ్ పడింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్జు స్పందిస్తూ... నేను అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తిని. బీఫ్ తింటాను. దమ్ముంటే ఎవరైనా ఆపగలరా? అంటూ నక్వీకి సవాల్ విసిరాడు. అయితే హిందువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గోసంరక్షణపై విధించిన నిషేధానికి చట్టం చేయాలని కొరవచ్చు. కానీ, బీఫ్ ఎక్కువగా తినే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నిషేధం విధించటం సరికాదని ఆయన అంటున్నారు. మరి బీజేపీ నేతలో, దాని మిత్రపక్షాలైన శివసేన, వీహెచ్ పీ లు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ