ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మోర్సీకి మరణశిక్ష

May 16, 2015 | 05:33 PM | 28 Views
ప్రింట్ కామెంట్
egypt_morsi_death_sentence_niharonline.jpg

ఈజిప్ట్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడు, 2013లో పదవి కోల్పోయిన మహ్మద్ మోర్సీకి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. 2011 లో దేశంలో చెలరేగిన అల్లర్ల సమయంలో తన అనుచరులతో కలిసి జైలు గోడలు బద్దలు కొట్టిన ఘటనలో మోర్సీపై కేసు నమోదు అయింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ఈజిప్ట్ కోర్టు శనివారం ఆయనతోపాటు ఆయన అనుచరులు వంద మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2013 లో అధికారంలో వచ్చిన కొద్దిరోజులకే ఆయన పాలనపై నిరసన పెల్లుబికింది. దీంతో సైన్యం తిరుగుబాటు చేసి మోర్సీని పదవీచ్యుతుడిని చేసింది. అధికారంలో ఉండగా, నిరసనకారులను అరెస్ట్ చేసిన చిత్రహింసలు పెట్టాలన్న ఆయన ఆదేశాలపై ఆగ్రహాం వ్యక్తం చేసిన కోర్టు ఇప్పటికే ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ