దురాశపరుడు మోదీగారు!

September 05, 2015 | 04:41 PM | 10 Views
ప్రింట్ కామెంట్
PM_Modi_RSS_meeting_niharonline.jpg

మంచివాళ్లందరూ భ్రష్ఠుపట్టి సర్వనాశనమైపోవాలనుందా మోదీజీ? రాజకీయాల్లోకి మంచోళ్లనే ఆహ్వానించడం సదుద్దేశమే మరి. కానీ, మంచితనం అనగనేమి? ఎవరు మంచివారు... వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా గుడ్ బాయ్స్ లా ఉండగలరా? ఎథిక్స్ కమిటీలాంటివి వీరి శీలంపై నిఘా ఉంచగలదా? రాజకీయం అంటే పరమ బూతుగా పరిగణించే రోజులివి. మోదీ బాల్యం నుంచే నియమబద్ధలతో వర్తించిన వ్యక్తి. ఆటుపోట్లు పేదరికపు వాసన చూసినవాడు. ఊరిచెరువులో చాకిరేవు పెట్టినవాడు. ఉతుక్కునేందుకు కుర్తా చేతులు పొట్టి చేసుకున్నానని, చెంబు ఇస్త్రీ ప్రాక్టీసు ఉందని, బూట్లు తెల్లగా సుద్దముక్కలనుపయోగించి తొడిగేవాడినని చెప్పుకొచ్చేడు.

ఇవన్నీ ఒక ఎత్తు, ఆర్ఎస్ఎస్ కుటుంబ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదగడం చిన్న విషయం కాదు. అందుకే ఆ వ్యవస్థ చీఫ్ మోదీని కూర్చోబెట్టి క్లాసుపీకినా కిమ్మనలేదు. అదీ క్రమశిక్ష అంటే... ఇన్ని ఎత్తు పల్లాలు చూసినట్టయితే హృదయకాలేయాలు పరిశుభ్రంగా ఉండి సమాజం పట్ల శ్రద్ధ ఉండే అవకాశం ఉంటుంది. ఇంత మిమాంస జరిగిన తర్వాత ఏది మంచితనం? ఏది సమర్థత? బట్టతల రాజకీయానికి, మోకాలు మంచితనానికి ముడి పెట్టడం సాధ్యపడుతుందా? అవునూ ఇటీవల కాలంలో ప్రధాని పదిలక్షల సూటువేసుకున్నాడని అందరూ గగ్గోలు పెట్టారు కదా? ఏం మంచివాళ్లు ఇస్తే బట్టలు వేస్కోకూడదా? అన్నీ జవాబులేని ప్రశ్నలే! భారత్ మాతాకీ జై!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ