హైకోర్టులో పోయినా సుప్రీంలో తేల్చుకుంటాడట

February 16, 2015 | 04:24 PM | 21 Views
ప్రింట్ కామెంట్
nagam_janardana_reddy_on_chest_hospital_niharonline

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న చెస్ట్ ఆస్పత్రిని వేరే చోటకి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ నేత నాగం జనార్దన రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆస్పత్రి తరలిస్తే నగర ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే పరిపాలనా సౌలభ్యం కోరకు అన్ని అన్ని విభాగాలు ఒకేచోట ఉండాలన్న భావనతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకించబోమని కోర్టు స్పష్టంచేసింది. అంతేకాదు అంటువ్యాధుల ఆస్పత్రిని తరలించే విషయంలో తప్పేంటని న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. దీనిపై నాగం స్పందిస్తూ... హైకోర్టులో న్యాయం జరగకపోయినా సుప్రీంకోర్టు వెళ్తామని, అక్కడ కచ్ఛితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆయన చెబుతున్నాడు. ఇక ఈ వ్యవహారంపై ప్రభాకర్ అనే వ్యక్తి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఎర్రగడ్డ సమీపంలో చారిత్రక కట్టడాలు ఎక్కువగా ఉన్నాయని, సచివాలయ నిర్మాణాల వల్ల వాటన్నింటికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కోర్టు పూర్తి వివరాలను సంప్రదించాలని పిటిషనర్ కి సూచించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ