హమ్మయ్యా... సాగర్ సురుకు సల్లబడింది

February 14, 2015 | 04:48 PM | 18 Views
ప్రింట్ కామెంట్
Nagarjuna_Sagar_dam_niharonline

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. నిలిచిపోయిన ఏపీ జల విద్యుదుత్పత్తి పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తూ కుడికాలువ నుంచి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది. వెనువెంటనే సదరు నిర్ణయాన్ని అమలులోకి తెస్తూ సాగర్ ప్రాజెక్టుల్లోని 4,5 గేట్లను తెలంగాణ అధికారులు ఎత్తివేశారు. నీటి నిల్వలు అడుగంటడంతో మూడు రోజుల క్రితం ఏపీ పరిధిలోని పవర్ హౌజ్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. నీటి ని విడుదల చేయాలంటూ ఏపీ చేసిన ప్రతిపాదనకు తెలంగాణ సర్కార్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డ్యామ్ దగ్గర జరిగిన రచ్చ తెలిసిందే. దీంతో శనివారం ఉదయం రంగంలోకి దిగిన ఇరు రాష్ట్రాల సీఎంలు గవర్నర్ సమక్షంలో భేటీ అయి ఓ ఒప్పందానికి వచ్చారు. అనంతరం జరిగిన సమీక్ష మేరకు అధికారులు 7 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు అంగీకరించారు. దీంతో నీటి విడుదల ప్రారంభమైంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ