ఎవరో తెలీకుండానే జనార్దన్ కు నోటీసులు ఇస్తారా?

July 09, 2015 | 01:08 PM | 5 Views
ప్రింట్ కామెంట్
telangana_ACB_janardhan_sandra_veeraiah_niharonline

తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుని ఏసీబీ చేత విచారణ జరిపిస్తున్న ఓటుకు నోటు కేసు విచారణలో కొత్త చిక్కు వచ్చిపడింది. కేసు విచారణలో భాగంగా జనార్దన్ అనే కొత్త పేరు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఎవరన్న సంగతిని ఏసీబీ ఇంకా కనిపెట్టలేకపోతుందట. ఈ వ్యవహారంలో బాస్ కు మధ్యవర్తిగా ఈ జనార్దనే వ్యవహరించి ఉంటాడని ఏసీబీ అనుమానిస్తుంది. కేసుల్లో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్యల మధ్య జరిగిన సంభాషణల్లో పలుమార్లు జనార్దన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే అసలీ జనార్దన్ అనేది ఎవరన్నది ఏసీబీకి ఇంకా చిక్కుముడిగానే మారింది. అసలీ జనార్దన్ ఎవరో, అతన్ని ఎలా విచారించాలో తెలీక ఏసీబీ అయోమయంలో ఉంది. చాలా ఫోన్ కాల్స్ లో జనార్దన్ కు చెప్పారా? అని సెబాస్టియన్ అడిగాడన్న విషయాన్ని కాల్ రికార్డుల ద్వారా ఏసీబీ గుర్తించింది. దీంతో డీల్ లో ఆయన పాత్ర పెద్దదేనని ఏసీబీ అంచనాకు వచ్చింది. నేడు సండ్రను విచారించే సమయంలో జనార్దన్ ఎవరన్న విషయంపై ఓ స్పష్టత వస్తుందని ఏసీబీ భావిస్తుందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ