కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చెయ్యటంతో ఖాళీ అయిన వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఉపఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ని పోటీలో నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందట. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రిగానే కాదు, దేశ తొలి ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రాం కూతురిగా దళిత వర్గాల్లో ఆమెకు మంచి పేరు ఉంది. అంతేకాదు మొన్నటి ఏపీ పునర్వవస్థీకరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంలో ఆమెది కీలక భూమిక. ఈ నేపథ్యంలో ఆమె పట్ల తెలంగాణ ప్రజల్లో సానుకూలత ఉంటుందని పార్టీ యోచిస్తోందట. అంతేకాదు దళిత ఓటర్లు అధికంగా ఉండటంతో కలిసోచ్చే అంశమని భావిస్తోందట. అంతేకాదు ఇతర పార్టీలను ఈజీగా కన్విన్స్ చేసి బరిలోంచి తప్పించోచ్చనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆమె ఎంపిక పెద్ద కష్టమేమి కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.