బీహార్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుదామనుకున్న జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ కు బ్రేక్ పడింది. శాసనసభాపక్షనేతగా ఆయన ఎన్నికపై పాట్నా హైకోర్టు స్టే ఇచ్చింది. నితీశ్ ను ఎన్నుకునేందుకు ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు బీహార్ సీఎం జితన్ రాం మాంఝీ మద్ధతుదారుడైన రాజేశ్వర రాజ్ దాఖలు చేసిన పిల్ పై కోర్టు బుధవారం విచారణ చేపట్టి పై తీర్పునిచ్చింది. సీఎం కావాలన్న కోరికతో ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ముందు పెరేడ్ నిర్వహించేందుకు హస్తిన చేరుకున్న నితీశ్ కి ఇది పెద్ద షాకే. దీంతో మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న హస్తిన చేరుకున్న నితీశ్ ఆశకు అడ్డుకట్ట పడినట్లయ్యింది.