సమోసా, కచోరీ, జిలేబీలను వదల్లేదు

January 13, 2016 | 04:59 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Nitish govt imposes tax on samosa kachauri and jalebis niharonline

ఆలూ లంటే లాలూ.., లాలూ అంటే ఆలూ... బీహార్ రాజకీయాల్లో నిత్యం వినిపించే మాట. అలాంటి ‘ఆలూ’ను నితీశ్ కుమార్ సర్కారు సమోసాలో నుంచి తీసేసింది. పేదోడు కూడా కొనగలిగే సమోసాను బీహార్ ప్రభుత్వం లగ్జరీ వస్తువుల్లో చేర్చేసింది. అంతేకాదు, సమోసాలపై ఏకంగా 13.5 శాతం పన్నేసింది. సమోసాతో పాటు కచోరీని కూడా నితీశ్ సర్కారు వదల్లేదు.

                    ఇక తీపి పదార్థాల్లో చీప్ గా దోరికే జిలేబీని కూడా బీహార్ సర్కారు లగ్జరీ వస్తువుల్లో చేర్చింది. ఈ మేరకు నిన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన సమావేశంలో ఆ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. కేజీ విలువ రూ.500 కంటే ఎక్కువ ధర పలికే స్వీట్ల కింద జిలేబీని, సాల్టీ తినుబండారాల కింద సమోసా, కచోరీలను కూడా లగ్జరీ వస్తువుల కింద చేరుస్తున్నట్లు ప్రకటించింది. లగ్జరీ వస్తువుల కోటాలో విధిస్తున్న 13.5 శాతం పన్నును కొత్త వస్తువులపైనా విధించనున్నట్లు ప్రకటించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ