ఎనిమిది నెలల మోదీ పాలన వ్యతిరేకతకు ప్రజాతీర్పే ఢిల్లీ ఫలితాలని జేడీ(యూ) సీనియర్ నేత నితీశ్ కుమార్ తెలిపారు. ఫలితాలతో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ లో జరగబోయే బీహార్ ఎన్నికల ఫలితాలలో కూడా సేమ్ ఫలితాలు రిపీట్ అవుతాయని భావిస్తున్నట్లు అన్నారు. ఢిల్లీ దేశానికి గుండె వంటిది. అక్కడి ప్రజల తీర్పు దేశ ప్రజలందరి తీర్పుగా భావించాలి. అక్కడే వ్యతిరేకత ఉన్నప్పుడు బీహార్ లో కూడా కచ్ఛితంగా ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో బీహార్ వాసులు ఎక్కువగా ఉంటారు. బీజేపీ సంబంధిత శాఖ జనసంఘ్ పుట్టిందే ఢిల్లీలో... అలాంటి చోటే ఘోరపరాభవాన్ని చూశారు. అసలు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు బీజేపీ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణలాంటివి’’ అని ఆయన పేర్కొన్నారు.