పాలేరు ఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ మైండ్ గేమ్ మొదలుపెట్టిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అనుకూలంగా ఓ పత్రికను ఉపయోగించుకుంటూ నేతల వ్యవహారంలో వదంతులు రాస్తూ గజిబిజిని సృష్టిస్తోంది. తెలుగుదేశం తరపున మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య. ప్రస్తుతం సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గతంలో పాలేరు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. దీంతో స్థానిక బలం ఉన్న నేతగా ఆయననే పాలేరు బరిలో దించాలని టీడీపీ ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ నేతలు సండ్రతో సంప్రదింపులు జరుపుతున్నాయని సదరు దినపత్రిక ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
ఇక ఇదే విషయమై సండ్రను ప్రశ్నిస్తే... ఇదంతా టీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ అని చెప్పిన సండ్ర 'చేరేది లేదు' అని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారంటూ ఆ కథనం పేర్కొంది. ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మాత్రం చెప్పి తప్పించుకున్నారంట. ఓటుకు నోటు కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. దీంతో ఖచ్ఛితంగా ఆయన టీఆర్ఎస్ లోకి చేరతారని చెబుతోంది ఆ పత్రిక. తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని ఈ పత్రిక కథనం ప్రచురించగా, ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. ఒకవేళ అదే వార్త నిజమై సండ్ర కూడా టీఆర్ఎస్ లో చేరితే, తెలుగుదేశం పార్టీకి మిగిలేది రేవంత్ ఒక్కరే. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య టీడీపీలో యాక్టివ్ గా లేరు గనుక.