దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘటన

May 10, 2016 | 02:39 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Uttarakhand-president-rule-exception-two-hours-niharonline

రాజకీయ సంక్షోభం నెలకొన్న ఉత్తరాఖండ్ లో రావత్ ప్రభుత్వం ఎట్టకేలకు విశ్వాస పరీక్షలో నెగ్గింది. అయితే ఈ విషయాన్ని బుధవారం సుప్రీంకోర్టు ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో దేశ రాజకీయ చరిత్రలోనే మొదటిసారిగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. పలు నాటకీయ పరిణామాల్లో భాగంగా ఉత్తరాఖండ్ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో పెట్టిన కేంద్రం... ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫారసు చేసింది. కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చేసింది. అయితే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతి పాలనను ఓ రెండు గంటలపాటు పక్కనపెట్టింది.

                     సుప్రీంకోర్టు మొట్టికాయలతో అయిష్టంగానే హరీశ్ రావత్ సర్కారు బల పరీక్షకు తలాడించిన కేంద్రం... రెండు గంటల పాటు రాష్ట్రపతి పాలనను ఎత్తివేసేందుకు ఒప్పుకోక తప్పలేదు. ఈ క్రమంలో నేటి విశ్వాస పరీక్ష జరిగింది. ఇందుకోసం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తాత్కాలికంగా రద్దైంది. అయితే బల పరీక్ష ముగిసి అధికార, విపక్షాలు బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు తిరిగి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. తమకు 34 ఓట్లు రాగా, విపక్ష బీజేపీకి 28 ఓట్లు మాత్రమే వచ్చాయని హరీశ్ రావత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ